Thu Mar 19 2026 04:34:52 GMT+0530 (India Standard Time)
మద్య నిషేధం అంటే ఇదేనా?
మద్యనిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నానరని నాదెండ్ల మనోహర్ అన్నారు.

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నానరని నాదెండ్ల మనోహర్ అన్నారు. . అంతేకాకుండా మద్యం ద్వారా వచ్చిన రాబడిని చూపించి బాండ్ల ద్వారా అమ్ముకుంటున్నారని జనసేన నేత నాదెండ్ల తెలిపారు. మద్యనిషేధం అంటే మద్యం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని 9 వేల కోట్ల నుంచి 22 వేల కోట్లకు పెంచుకోవడమా? అని ఆయన ప్రశ్నించారు.
బాండ్లను అమ్మి.....
మద్యం ద్వారా వచ్చిన రాబడిని చూసి ఎనిమిది వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను అమ్ముతున్నారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ స్పిరిటెడ్ విజనరీ, మ్యానిఫేస్టో అమలు అంటే ఇదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవడంతో పాటు అప్పుకూడా పొందారని విమర్శించారు.
Next Story

