Sat Mar 07 2026 23:56:35 GMT+0530 (India Standard Time)
YSRCP : ఎమ్మెల్యే వసంతకు సీఎంవో నుంచి పిలుపు
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్నారు. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ను మారుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో నియోజకవర్గంలోని వైసీపీ వర్గాల్లో టెన్షన్ పట్టుకుంది.
టిక్కెట్ విషయంపై...
గత ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై గెలుపొందారు. ఈసారి అక్కడి నుంచి మంత్రి జోగి రమేష్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మైలవరం నియోజకవర్గం టిక్కెట్ మార్పుపైనే వసంత కృష్ణ ప్రసాద్ ను ముఖ్యమంత్రి కార్యాలయం పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story

