Sat Mar 07 2026 23:56:16 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమకు వసంత సవాల్
మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలకు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు

మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలకు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. మైనింగ్ల పేరుతో దేవినేని వినిపిస్తున్నది పాతపాటేనన్నారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజం చేయలేవన్న వసంత కృష్ణప్రసాద్ పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటానని దేవినేని ఉమను హెచ్చరించారు.
అతి చేస్తే....
పద్ధతి తప్పి అతిచేస్తే అంతే స్థాయిలో తాను కూడా మాట్లాడాల్సి వస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు. ఎవరి పని వారుచేసుకుంటే మంచిదని సూచించారు. "ఉమా నీ పని నువ్వు చేసుకుంటే నా పని నేను చేసుకుంటా" "నీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా" అని వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ సవాల్ విసిరారు.
Next Story

