Wed Dec 17 2025 06:38:52 GMT+0000 (Coordinated Universal Time)
నా ప్రయాణం జగన్ తోనే : వసంత
తన ప్రయాణం ఎప్పటికీ వైఎస్ కుటుంబంతోనే అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

తన ప్రయాణం ఎప్పటికీ వైఎస్ కుటుంబంతోనే అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో వైసీపీ నేతలే తనను ఇబ్బంది పెట్టడం బాధ అనిపించిందన్నారు ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. కొద్ది మాసాల నుంచి మాత్రమే మైలవరంలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ సీరియస్ గా ఉందన్నారు. తాను పార్టీల మారాల్సిన అవసరం లేదన్నారు. జగన్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు.
తన సమస్యలతో...
జగన్ కూడా తనతో 25 ఏళ్ల పాటు ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. మరొకసారి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడమని జగన్ చెప్పారన్నారు. మైలవరంలో తనకు పార్టీ నుంచి ఇక ఎలాంటి సమస్యలు రావని నమ్ముతున్నానని తెలిపారు. తాను నందిగామకు చెందిన వాడినైనా ఆ నియోజకవర్గంలో తాను జోక్యం చేసుకోనని అన్నారు. కానీ జోగి రమేష్ వ్యక్తిగతంగా తనతో బాగుంటారన్నారు. కానీ జోగి రమేష్ అనుచరులు సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతున్నారన్నారు. త్వరలో అవి సర్దుకుంటాయని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.
Next Story

