Sun Dec 14 2025 05:01:59 GMT+0000 (Coordinated Universal Time)
నేను ఎప్పుడు తిట్టినా నిన్నే తిడతా
తాను టీడీపీలో చేరతానని దేవినేని ఉమామహేశ్వరరావు భయపడిపోతున్నాడని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

తాను టీడీపీలో చేరతానని దేవినేని ఉమామహేశ్వరరావు భయపడిపోతున్నాడని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. తన చేత చంద్రబాబును, లోకేష్ ను తిట్టించాలని చూస్తున్నాడని అన్నారు. కానీ తనకు సంస్కారం ఉందని, తనపై విమర్శలు చేయని వారిని తాను ఎందుకు తిడతానని ఆయన ప్రశ్నించారు.
పదవులకు లొంగేవాడిని...
తాను మాత్రం దేవినేని ఉమను మాత్రమే తిడతానని ఆయన చెప్పారు. తాను పదవులకు లొంగేవాడిని కానని ఆయన అన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేసినంత మాత్రాన గెలవలేవని ఆయన అన్నారు. మంత్రి జోగి రమేష్ తో తనకు చిన్న చిన్న విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు.
Next Story

