Sun Jan 19 2025 23:57:19 GMT+0000 (Coordinated Universal Time)
జోగీ కుల రాజకీయాలు మానుకో
మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గౌడ కులం అంటూ తాను బీసీ నంటూ ఆ కులం వారినే జోగి రమేష్ మోసం చేశాడని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగాలిప్పిస్తానని గౌడ కుటుంబానికి చెందిన కొందరి నుంచి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశాడని వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ఆరోపణలు చేశారు.
సొంత కులానికే...
జోగి రమేష్ కేవలం తన కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. సొంత కులానికే మంచి చేయని వ్యక్తి జోగి రమేష్ అని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు ఇంటి మీదకు దాడి చేసిన తర్వాతనే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని వసంత గుర్తు చేశారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను నిలువునా మోసం చేసిన చరిత్ర జోగి రమేష్ ది అన్నారు. ఆయన ఇప్పుడు ఎన్ని సెంటిమెంట్ డ్రామాలు ఆడినా ఉపయోగం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
Next Story