Fri Dec 05 2025 11:24:18 GMT+0000 (Coordinated Universal Time)
పాలేరు జలాశయంలో మీసాలజెల్ల
ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ఓ మత్స్యకారునికి 20 కిలోల చేప గాలానికి చిక్కింది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ఓ మత్స్యకారునికి 20 కిలోల చేప గాలానికి చిక్కింది. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మేకల పరశురాములు జలాశయం మధ్యలో ఉన్న దేవునిగుట్ట వద్ద గాలం వేశాడు. ఆ గాలానికి ‘బండజెల్ల’ అనే రకం చేప చిక్కింది. బండజెల్ల స్పెరాట జాతికి చెందిన లాంగ్ విస్కర్డ్ క్యాట్‌ఫిష్ చేప అని నిపుణులు తెలిపారు. ఇది తినే రకమేనని కూడా స్పష్టం చేశారు. మీసాలతో ఉండే ఈ చేపలు స్థానిక జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయి. కొమ్ముజెల్ల చేపలతో పోలిస్తే పొడవు తక్కువగా, అధిక లావుతో ఇవి ఉంటాయన్నారు. అరుదైన చేపకు మంచి ధర పలకడంతో మేకల పరశురాములు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Next Story

