Mon Dec 15 2025 08:41:00 GMT+0000 (Coordinated Universal Time)
తొలి ఫలితం వైసీపీదే
కమలాపురంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. తొలి ఫలితం అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చింది.

కమలాపురంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. తొలి ఫలితం అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చింది. కమలాపురం మున్సిపాలిటీలోని 11 వార్డులో వైసీపీ అభ్యర్థి సలీలా టీడీపీ అభ్యర్థిపై 250 ఓట్లతో విజయం సాధించారు. తొలి ఫలితం అనుకూలంగా రావడంతో మిగిలిన వార్డుల్లో కూడా వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నారు.
ప్రతిష్ఠాత్మకం...
కమలాపురం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ రవీంద్ర నాధ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు వైసీపీికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మిగిలిన వార్డుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
- Tags
- kamalapuram
- ycp
Next Story

