Sun Mar 15 2026 11:52:58 GMT+0530 (India Standard Time)
మా నాన్న వైసీపీలో చేరరు : ముద్రగడ కుమారుడు
ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తిగా లేరని ఆయన తెలిపారు

ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తిగా లేరని ఆయన తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ టీడీపీలో కానీ, జనసేనలో కానీ చేరేందుకు ఇష్టపడుతున్నారని గిరిబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన తండ్రి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తామని తెలిపారు.
పోటీ గ్యారంటీ...
తాము పిఠాపురం లేక కాకినాడ పార్లమెంటు లేదా పత్తిపాడు నుంచి పోటీ చేస్తామని గిరిబాబు తెలిపారు. అన్నింటికి సిద్ధపడి తాము గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని ముద్రగడ గిరిబాబు తెలిపారు. తాము ఈసారి ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి తీరుతామని తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.
Next Story

