Sun Mar 15 2026 10:21:24 GMT+0530 (India Standard Time)
Mudragada : ముద్రగడ లాస్ట్ అప్పీల్.. ఓటు వేయకుంటే?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో పేదవారు కడుపునిండా తిండి తినే పరిస్థితి ఉందని ముద్రగడ పద్మనాభం అన్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో పేదవారు కడుపునిండా తిండి తినే పరిస్థితి ఉందని ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఖరీదైన వైద్యం అందించిన ఘనత వైఎస్ జగన్ ది అని ఆయన అన్నారు. గతంలో తాను ఎంతోమంది ముఖ్యమంత్రి వద్ద పనిచేశానని, ఎన్టీ రామారావు, వైెఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగా ఎవరూ చేయలేదని ముద్రగడ పద్మనాభం అన్నారు
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే...
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే విషయంలో మనమంతా తప్పు చేస్తే నష్టపోతామండి అంటూ ముద్రగడ అన్నారు. ఎన్నికల్లో మనమంతా జగన్ మోహన్ రెడ్డిని గౌరవించవలసిన బాధ్యత ఉందని, అందరి ఇళ్లల్లో ఫ్యాన్ గాలి చల్లగా ఇస్తుందని, ఆ గాలిని మనం స్వీకరిస్తున్నామని ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందిస్తారని కోరుతున్నానండి అంటూ ముద్రగడ ముగించారు.
Next Story

