Sat Mar 28 2026 07:45:04 GMT+0530 (India Standard Time)
టీటీడీ ఈవోగా ఈవోగా ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలను స్వీకరించారు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలను స్వీకరించారు. ఆయన కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు చేరుకుని తొలుత భూవరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు నూతన ఈవో ముద్దాడ రవిచంద్రకు వేద ఆశీర్వచనాలు అందించారు.
భక్తులకు సేవలందించి...
ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందని ముద్దాడ రవిచంద్ర తెలిపారు. అందరి నమ్మకాలను నిలపెడతాననని దేవుడు ఇచ్చిన శక్తితో నా విధులు నిర్వర్తిస్తానని తెలపిారు. టీటీడీ బోర్డు ,అనుభవజ్ఞుల సలహాలు,ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్న్నారు. భక్తులకు సేవలు అందించే శక్తి,ఆశీర్వాదం స్వామివారు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story

