Tue Jan 20 2026 13:49:52 GMT+0000 (Coordinated Universal Time)
Raghurama krishna Raju:ఎన్నికల కమిషన్కు జగన్ పై ఫిర్యాదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు

Raghurama krishna Raju :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేశారని, ఒకటి విజయవాడ, మరొకటి విశాఖలో ఉంచారని, హెలికాప్టర్ లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన అభ్యంతరం తెలిపారు.
రెండు హెలికాప్టర్లను...
ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను జగన్ ఉపయోగించడానికే వీటిని సిద్ధం చేస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని ఆయన తాను ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు
Next Story

