Fri Dec 05 2025 22:18:50 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి, ఆ ఆంగ్ల పత్రికకు లింకులున్నాయ్
వైసీపీ ప్రభుత్వానికి, ఒక ఆంగ్ల పత్రికకు మంచి సంబంధాలున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

వైసీపీ ప్రభుత్వానికి, ఒక ఆంగ్ల పత్రికకు మంచి సంబంధాలున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆ పత్రికలోనే చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నట్లు వార్త వచ్చిందన్నారు. అయితే చిరంజీవి రాజ్యసభ పదవికి ఒప్పుకోరని తాను భావిస్తున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్గించే విధంగా చిరంజీవి వ్యవహరించరని తాను అనుకుంటున్నానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
న్యాయం జరగకుంటే కోర్టుకే...
చిరంజీవి చెప్పకపోతే సినిమా కష్టాలు జగన్ కు తెలియవా? అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. న్యాయం చేయకపోతే సినిమావాళ్లు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. జగన్ కు ఇష్టం లేకపోతే వ్యవస్థలను, వ్యక్తులను పక్కన పెడతారని ఆయన అన్నారు. పోలీసులను కేవలం తనపై విమర్శలు చేసే వారిపై కేసులు పెట్టేందుకే ప్రభుత్వం వినియోగిస్తుందన్నారు. టీడీపీ నేత చంద్రయ్య హత్య దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నడుపుతందని చెప్పారు. మహిళ శిశు సంక్షేమ శాఖల బాటలోనే ఇతర శాఖలు పయనిస్తాయని రఘురామ కృష్ణరాజు చెప్పారు.
Next Story

