Sat Mar 07 2026 21:57:52 GMT+0530 (India Standard Time)
రఘురామ రేపు ఉపవాస దీక్ష
ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం పీఆర్సీ పేరుతో మోసం చేసిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన పీఆర్సీ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆయన అన్నారు. తమకు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రివర్స్ పీఆర్సీ...
సీఎం జగన్ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ప్రకటించారన్నారు. ఇందుకు నిరసనగా రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తాను దీక్ష చేస్తానని, వారికి సంఘీభావం తెలుపుతానని చెప్పారు.
Next Story

