Wed Mar 18 2026 06:29:22 GMT+0530 (India Standard Time)
ఉప ఎన్నికకు రెడీ.. కాచుకో జగన్
ఎంపీ రఘురామ కృష్ణరాజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామ చేస్తానని చెప్పారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామ చేస్తానని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ చేస్తూ తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై...
తాను ఏపార్టీలో చేరే విషయం ఇప్పుడే చెప్పలేనని, అయితే ఉప ఎన్నిక ద్వారా వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందన్నది తెలుస్తుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. తనపై అనర్హత వేటు వేయకపోయినా తానే రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారు. ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బంది పడుతున్నారని, వారంతా తనకు అండగా నిలుస్తారని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
Next Story

