Sun Dec 14 2025 04:55:06 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ కారణంగానే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
ఎంపీ నందిగం సురేష్ పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు

తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ, జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు. ఎంపీ నందిగం సురేష్ పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు. అప్పట్లో జరిగిన ఘటనలకు ఉదయ్ కిరణ్ ను టార్గెట్ చేశారని.. ఎలాంటి అవకాశాలు రాకుండా చేశారని అన్నారు. అందువల్లే ఉదయ్ కిరణ్ డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు చెమటోడ్చి పార్టీ కోసం కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ వారి చెమటను ప్యాకేజి కోసం చంద్రబాబుకు అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని అన్నారు. ఒక పార్టీ ప్రెసిడెంటుగా ఉండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్ ను తిడతాడు. మనకు ఎక్కడున్నాయి బూత్ కమిటీలు? మనకు ఎక్కడున్నాయి మండల కమిటీలు? ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సింది ఎవరో అందరికీ తెలుసు.. ఈ పనులన్నీ పార్టీ అధ్యక్షుడు చేయాలి. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నను అథఃపాతాళానికి తొక్కుతానంటున్నావు.. చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తూ నువ్వే అథఃపాతాళానికి వెళ్లావన్న విషయం నిన్నటి సభతో స్పష్టంగా అర్థమైందన్నారు రోజా.
Next Story

