Sat Mar 28 2026 14:39:10 GMT+0530 (India Standard Time)
పులిని బంధించడానికి పూణె నుంచి ప్రత్యేక బృందం
తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.

తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రాజానగరంలో పెద్దపులి ఆవుపై దాడి చేసింది. జనావాసాల మధ్య సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీసీ టీవీ కెమెరాలో పులి కదలికలను గుర్తించిన అధికారులు ఈ పులిని బంధించడానికి పూణె నుంచి ప్రత్యేక బృందాలను నేడు రప్పించనున్నారు.
రాజానగరం చుట్టు పక్కల ప్రాంతంలో...
రాజానగరం చుట్టు పక్కల ప్రాంతంలోనే పెద్దపులి సంచరిస్తుండటంతో ఆ ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ దాదాపు పదిహేను కిలోమీటర్ల వరకూ పులి ప్రయాణం చేస్తున్నట్లు పులి కదలికలను బట్టి అంచనా వేసిన అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story

