Fri Dec 05 2025 16:17:57 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : కడప జిల్లాలో పెద్దపులి
కడప జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. చిట్వేలి అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు

కడప జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. చిట్వేలి అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి తిరుమల అడవుల్లోకి వెళ్లే అవకాశముందని కూడా అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే పెద్ద పులి జాడను కనుగొనేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
నిఘా కెమెరాల్లో...
అదే సమయంలో చిట్వేలి ప్రాంతంలో ముప్ఫయి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని, అయితే ట్రాప్ కెమెరాలలో రాత్రి వేళ మాత్రమే కాకుండా పగటి పూట కూడా పెద్దపులి సంచరిస్తున్నట్లు బయటపడిందని చెప్పారు. దీంతో అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి నల్లమల శేషాచలం కారిడార్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు అలెర్ట్ చేశారు.
Next Story

