Sat Mar 07 2026 18:02:43 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీలో చేరిక
వైసీపీ రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్ లు నేడు టీడీపీలో చేరనున్నారు

వైసీపీ రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్ లు నేడు టీడీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇద్దరూ టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు నాయుడు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించనున్నారు.
రాజ్యసభ సభ్యులుగా...
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్ లు వైసీపీ రాజ్యసభ సభ్యులుగా నియమించింది. అయితే వైసీపీ రాష్ట్రంలో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈరోజు మంచి ముహూర్తం కావడంతో టీడీపీలో చేరేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు.
Next Story

