Sun Apr 27 2025 03:23:35 GMT+0000 (Coordinated Universal Time)
శ్రావణమాసం.. నేటి నుంచి ముహూర్తాలే... మూడు ముళ్లు
శ్రావణ మాసం వచ్చింది. ఆషాఢం వెళ్లింది. నేటి నుంచి మంచి ముహూర్తాలు వచ్చేశాయి

శ్రావణ మాసం వచ్చింది. ఆషాఢం వెళ్లింది. నేటి నుంచి మంచి ముహూర్తాలు వచ్చేశాయి. ఈరోజు నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుంటుంది. మూఢం, ఆషాఢం కావడంతో మే నెల నుంచి అసలు ముహూర్తాలే లేవు. దాదాపు మూడు నెలల నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు జరగడం లేదు. అయితే ఈరోజు నుంచి మంచి ముహూర్తాలుండటంతో పెళ్లిళ్లు ప్రారంభమవుతున్నాయి.
వరసగా శుభకార్యాలు...
దీంతో కల్యాణమండపాలకు, ఫొటో గ్రాఫర్లకు, క్యాటరింగ్ వంటి వారికి మళ్లీ గిరాకి పెరిగినట్లే. ఈరోజు నుంచి కేవలం వివాహాలు మాత్రమే కాకుండా గృహ ప్రవేశాలు, భూమి పూజలు, ఇళ్లలో శుభకార్యాలు నిర్వహించుకునే వీలుంది. దీంతో అన్నింటికి డిమాండ్ పెరుగుతుంది. వరసగా ముహూర్తాలున్నాయి. ఆగస్టు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి.
Next Story