Sun Mar 15 2026 23:27:46 GMT+0530 (India Standard Time)
మండలి ఛైర్మన్ గా మోషేన్ రాజు
శాసనమండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ మోషేన్ రాజు నామినేషన్ వేశారు. ఆయనను రేపు మండలి ఛైర్మన్ గా ఎన్నికునే అవకాశముంది.

శాసనమండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ మోషేన్ రాజు నామినేషన్ వేశారు. ఆయనను రేపు మండలి ఛైర్మన్ గా ఎన్నికునే అవకాశముంది. మోషేన్ రాజు పేరు తొలి నుంచి ప్రచారంలో ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే జగన్ మండలి ఛైర్మన్ పదవి హామీ ఇచ్చారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
వెస్ట్ గోదావరిలో....
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు తొలి నుంచి వైసీపీలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నమ్మకమైన నేతగా ఉండటంతో జగన్ ఆయనకు కొంతకాలం క్రితం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు కేబినెట్ ర్యాంకు ఉన్న మండలి ఛైర్మన్ పదవిని ఇస్తున్నారు.
Next Story

