Sat Dec 06 2025 08:41:33 GMT+0000 (Coordinated Universal Time)
YCP: అందుకే వైసీపీకి రాజీనామా చేశా
తాను వైసీపీకి రాజీనామా చేసిన కారణాలను ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తెలిపారు

YCP:తాను వైసీపీకి రాజీనామా చేసిన కారణాలను ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తెలిపారు. అరాచక పాలనలో తాను భాగస్వామ్యుడిని కాకూడదనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశానని, తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవిని కూడా ఉంచుకోదలచుకోలేదని చెప్పారు. మూడేళ్లు ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ తాను రాజీనామా చేశానని, తాను రెండేళ్ల నుంచి పార్టీలో అసంతృప్తితోనే ఉన్నానని, కానీ ఎక్కడా బయటపడలేదని ఆయన తెలిపారు.
రాజకీయ విలువలు...
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయన్న సి.రామచంద్రయ్య పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందన్నారు. కనీసం తమ లాంటి పెద్దల సలహాలను కూడా తీసుకునే పరిస్థిితి లేదన్నారు. తాను రాజీపడకుండా ఎక్కడా ఉండలేనని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ విలువలను తాను కాపాడేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ కూడా తనను కలిసే అవకాశం ఏనాడూ ఇవ్వలేదన్నారు. అప్పులు చేసి ప్రజల భవిష్యత్ తో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

