Mon Mar 09 2026 08:04:47 GMT+0530 (India Standard Time)
సీరియస్ గానే టీడీపీ నేత ఆరోగ్య పరిస్థితి
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం ఆయన గుండెపోటుకు గురై విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
వెంటిలేటర్ సపోర్టుతో...
ఆయనకు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అన్ని రకాలుగా ఆయనను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ అభిమానులు రమేష్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. టీడీపీ నేతలు కూడా ఆసుపత్రికి వెళ్లి బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. బచ్చుల అర్జునుడు ప్రస్తుతం టీడీపీ గన్నవరం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
Next Story

