Mon Mar 09 2026 08:03:57 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్సీకి గుండెపోటు
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు.

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్చునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
స్టంట్ వేసి...
వైద్యులు బచ్చుల అర్జునుడుకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రమేష్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బచ్చుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
Next Story

