Sun Mar 22 2026 21:16:59 GMT+0530 (India Standard Time)
11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు

జంగారెడ్డి గూడెం లో మరణాలపై తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఆందోళనలను రెండో రోజూ కొనసాగించింది. సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించారు. అయినా మాట వినకపోవడంతో ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు.
ఒకరోజు సస్పెన్షన్....
చినరాజప్ప, రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్, భవానీ, బెందాళం అశోక్, గణేష్ కుమార్, జోగేశ్వరరావు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లను సస్పెండ్ చేశారు. సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు.
Next Story

