Thu Dec 18 2025 05:10:28 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాల నుంచి రిటైరయినట్లే కదా.. అన్న పేర్ని నాని ప్రశ్నకు గోరంట్ల బుచ్చన్న ఏమన్నారంటే?
.మాజీ మంత్రి పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు విని నవ్వుకున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు విని నవ్వుకున్నారు. పేర్ని నాని మాట్లాడుతూ త్వరలో తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని మీరు కూడా రిటైర్ అయినట్లే కదా? అని ప్రశ్నించారు.
వచ్చే సభలోనూ...
దానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమాధానమిస్తూ తాను రిటైర్ కావడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మీకు టిక్కెట్ రాదని అంటున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించగా 2024 ఎన్నికల్లోనూ తాను సభలోకి అడుగు పెడతానని తెలిపారు. తన టిక్కెట్ ఎక్కడకూ పోలేదని ఆయన వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్న సభ్యులు నవ్వుకున్నారు.
Next Story

