Fri Dec 05 2025 17:49:17 GMT+0000 (Coordinated Universal Time)
వసంత మళ్లీ ...ఏసేశాడు
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. గతంలో గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కూడా ఇదే తరహాలో కామెంట్ చేశారు. ఉయ్యూరు శ్రీనివాస్ మంచి వాడని, అతడిపై అక్రమ కేసులు పెడితే ఎన్ఆర్ఐలు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు వస్తారని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ప్రత్యర్థులపై కేసులు...
తాజాగా తాను పోరంబోకులను వెంటేసుకుని రాజకీయాలు చేయనని, అలా చేయగలిగితేనే నేటి రాజకీయాల్లో నిలబడగలతామని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదన్న వసంత తన తండ్రి వసంత నాగేశ్వరరావు నాటి రాజకీయాలు నేడు లేవని అన్నారు. ప్రతిపక్షాలపై తాను తప్పుడు కేసులు బనాయించనని, అందుకే పార్టీలో కొందరికి తనపై అసంతృప్తి అని వసంత కృష్ణ ప్రసాద్ అనడం మరోమారు పా్రటీలో చర్చనీయాంశమైంది.
Next Story

