Sat Dec 06 2025 01:05:20 GMT+0000 (Coordinated Universal Time)
కమ్మోళ్లకు ఎందుకీ అన్యాయం : వసంత నాగేశ్వరరావు
రాష్ట్రంలో కమ్మ వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు అన్నారు

రాష్ట్రంలో కమ్మ వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఆయన కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజికవర్గానికి జగన్ చేస్తున్న అన్యాయంపై వసంత నాగేశ్వరరావు సమావేశంలో ప్రస్తావించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును కూడా ఎవరూ అడ్డుకోలేక పోవడం విచారకరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి లేకపోవడంపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఏ ప్రభుత్వంలోనూ...
గతంలో ఎన్నో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన వారు కూడా ఇలా అన్యాయం చేయలేదన్నారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెెడ్డి పేర్లతో అనేక సంస్థలు ఉన్నాయని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వమూ ఆ పేర్లను తొలగించలేదని పేర్కొన్నారు. ఇతర సామాజిక వర్గాల పల్లకీలను ఇంకెంత కాలం మోస్తారని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. పొరుగున ఉన్న తెలంగాణ కేబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఉన్నారని, ఏపీలో ఎందుకు లేరని ఆయన నిలదీశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.
Next Story

