Sun Aug 07 2022 18:27:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారాణ అయింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనాగా తేలింది. దీంతో వల్లభనేని వంశీ హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
మొహాలీలో అస్వస్థతకు గురై...
ఇటీవల వల్లభనేని వంశీ పంజాబ్ లోని మొహాలీ ఐఎస్బీ క్యాంపస్ లో క్లాసులకు హాజరయ్యారు. అక్కడ కూడా అస్వస్థతకు గురయ్యారు. అక్కడి నుంచి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం గన్నవరం నియోజకవర్గానికి రానున్నారు.
Next Story