Thu Jan 29 2026 05:49:00 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి కామెంట్స్ విన్నారా?
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుందన్నారు

దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తాడేపల్లి కార్యాలయంలో బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుందన్నారు. అంతే తప్ప ఎమ్మెల్యేలది కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నియోజకవర్గాల్లో నాలుగు సీసీ రోడ్లు వేయాలని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. అలాగే వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలని ఆయన కోరారు.
వందల కోట్ల బిల్లులు...
కార్యకర్తలకు తాను పనులను ఇచ్చి వారిని అప్పుల పాలు చేశామని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. బల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దర్శి నియోజకవర్గంలో దాదాపు వంద కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు. వెంటనే బిల్లులు చెల్లించేలా చూడాలని మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. కార్యకర్తల్లో ఆనందం నింపకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పారు. గడప గడపకు వెళితే సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.
Next Story

