Tue Mar 24 2026 18:44:55 GMT+0530 (India Standard Time)
జనసేన ఎమ్మెల్యేల అసంతృప్తిని విన్న పవన్ కల్యాణ్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేతలే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అందులో జనసేన ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయడం లేదని ఆయన ఈ సమావేశంలో పవన్ కు వివరించామని చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
ఇతర అంశాలపైన...
ఇతర అంశాలపై కూడా తాను సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో చర్చిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగానే నియోజకవర్గాల్లో ప్రజా వాణిని నిర్వహించాలని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజనపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
Next Story

