Mon Dec 15 2025 00:25:51 GMT+0000 (Coordinated Universal Time)
రాయుడి హత్య కేసుపై స్పందించిన బొజ్జల
శ్రీకాళహస్తికి చెందిని జనసేన కార్యకర్త రాయుడి హత్య కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.

శ్రీకాళహస్తికి చెందిని జనసేన కార్యకర్త రాయుడి హత్య కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత వివాదంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తొలిసారి రియాక్ట్ అయ్యారు. తనకూ కుటుంబం ఉందని, పిల్లలు ఉన్నారని, దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు.
తన ప్రమేయం లేదంటూ...
ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ హత్య కేవలం రాజకీయ కారణాలతో జరిగిందని తెలిపారు. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Next Story

