Sun Mar 15 2026 15:04:24 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన ఓటరు.. చేయి చేసుకోవడంతో?
తెనాలిలో ఎమ్మెల్యే ఓటరుపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి దిగారు.

తెనాలిలో ఎమ్మెల్యే ఓటరుపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి దిగారు. కారణం ఏంటో తెలియదు కానీ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటరు మధ్య చిన్న పాటి వివాదం చెలరేగడంతో ముందుగా ఎమ్మెల్యే ఓటరుపై చేయి చేసుకున్నారు.
తెనాలి ఎమ్మెల్యే...
అయితే వెంటనే ఓటరు కూడా తిరగబడ్డారు. ఎమ్మెల్యేను కొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరు పై దాడికి దిగారు. ఆ ఓటరు ఒక పార్టీకి అనుకూలంగా పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తుండటంతోనే ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇద్దరినీ సర్దిచెప్పి పోలీసులు వారిని బయటకు పంపారు.
Next Story

