Fri Mar 27 2026 20:27:09 GMT+0530 (India Standard Time)
వైఎస్సార్ షాదీ తోఫా వారికీ వర్తిస్తుంది
వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి కూడా వర్తిస్తుందని మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది

వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి కూడా వర్తిస్తుందని మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ షాదీ తోఫా దూదేకుల వారికి వర్తించదని కొందరు తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రత్యేకంగా....
దూదేకుల మెహతర్ ముస్లిం లకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. దూదేకుల పొలిటికల్ జేఏసీ విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మెహతర్ ముస్లింలకు కూడా లక్ష రూపాయలు షాదీ తోఫా కింద ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story

