Sat Dec 13 2025 19:30:42 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటులో నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో పార్లమెంటుకు చేరుకున్న ఇద్దరికీ టీడీపీ నేతలు స్వాగతం పలికారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ చౌహాన్ ను కలవనున్న మంత్రులను కలవనున్నారు.
మొంథా తుఫాను ప్రభావం
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ కు అందించనున్నారు. ఇటీవల మొంథా తుపానుతో పంట నష్టం ఎక్కువగా జరిగింది. వరద నష్టం అంచనాల కోసం కేంద్ర కమిటీ వచ్చి పరిశీలన చేసి వెళ్లింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో దీనిపై చర్చించేందుకు మంత్రి నారా లోకేష్, అనితలు నేడు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
Next Story

