Sat Dec 06 2025 09:45:38 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రాబాబుది వారిపై కపట ప్రేమ
ఆర్యవైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు

ఆర్యవైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సొంత పార్టీ నేత శిద్ధారాఘవరావును ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసునన్నారు.ఆయనను అవమానించారన్నారు. ఆర్యవైశ్యులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అలివి మాలిన ప్రేమ చూపస్తున్నారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆయనను అనేక ఇబ్బందులు పెట్టారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
తమ పార్టీకి....
రోశయ్య పట్ల తమ పార్టీకి గౌరవం ఉందని చెప్పారు. చంద్రబాబు అవమానించినట్లుగా ఆర్యవైశ్యులను తమ పార్టీ ఎప్పుడూ చేయలేదన్నారు. ఆర్యవైశ్యులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కపట ప్రేమను ఆర్యవైశ్యులు నమ్మరని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Next Story

