Fri Mar 20 2026 14:01:53 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటన పైమంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటన పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ ను ఆదేశించారు.
మరోసారి ఇలాంటి ఘటనలు...
మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. ఈ మేరకు డీఎంఈ వివరణ కోరుతూ సదరు ప్రైవేటు సంస్థకు షోకాజ్ నోటీసు జారీచేశారు. హాస్టల్ వార్డెన్ కు వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. హాస్టల్ లోని పరిస్థితులపై పరిశీలన చేయిస్తున్నామని డీఎంఈ రఘనందన్ తెలిపారు.
Next Story

