Thu Mar 26 2026 09:55:48 GMT+0530 (India Standard Time)
పాడుతా తీయగా సెలక్షన్ కమిటీలా ఉంది : రోజా
నిన్నటి జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు

నిన్నటి జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. పాడుతా తీయగా సెలక్షన్ కమిటీ కూర్చుని చర్చించిన తీరులో సమావేశం ఉందని అన్నారు. అటు ఆరుగురు, ఇటు ఆరుగురు కూర్చుని చర్చించారని, ఏ విషయంలో చర్చించినా ప్రయోజనం ఏమీ ఉండదని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గుండు సున్నా కోసం...
అటు అర సున్నా, ఇటు అరసున్నా కూర్చుని జైలులో ఉన్న గుండుసున్నా కోసం చర్చించారని ఆర్కే రోజా సెటైర్ వేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం కష్టమన్న రోజా నిజం తెలిస్తే భువనేశ్వరి కూడా జైలు కెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే నారా భువనేశ్వరి యాత్రను మొదలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

