Sun Jan 12 2025 21:04:05 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు యాత్రపై పవన్ ఏమంటాడు?
పిల్లలు సరిగా చదవకపోవడం, కోవిడ్ కారణంగానే ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి రోజా అన్నారు.
పిల్లలు సరిగా చదవకపోవడం, కోవిడ్ కారణంగానే ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి రోజా అన్నారు. రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని అన్నారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిని టీడీపీ నేతలు, లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని, వల్లభవనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని రోజా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ మీద కోపమని, అందుకే తరచూ పార్టీని మూసేస్తానని అంటున్నాడని రోజా అభిప్రాయపడ్డారు.
రోజా డ్రైవర్ ను....
పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. కాగా రోజా డ్రైవర్ మహా ద్వారం నుంచి ఆలయం ప్రవేశం చేయడానికి ప్రయత్నించడంతో విజిలెన్స్ అధికారులు వెనక్కు పంపారు. ప్యాంట్ ధరించిన మంత్రి రోజా డ్రైవర్ వీఐపీ బ్రేక్ దర్శనంలో మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించడాన్ని చూసిన విజిలెన్స్ అధికారులు వెనక్కు పంపారు. అయితే తన డ్రైవర్ మహా ద్వారం నుంచి వెళ్లలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు.
Next Story