Fri Jun 20 2025 02:07:51 GMT+0000 (Coordinated Universal Time)
Rk Roja : ఖచ్చితంగా పోటీ చేస్తా
మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆమె అన్నారు.

మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు నగరి నియోజకవర్గం టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారని రోజా మండి పడ్డారు. వారంతా అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారని ఆర్కే రోజా మండిపడ్డారు.
జగనన్న సైనికురాలిని....
ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరసలో తానే ముందుంటున్నానని ఆర్కే రోజా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. తాను జగనన్న సైనికురాలనని, జగన్ మాటే తనకు శిరోధార్యమని రోజా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారని అన్నారు.
Next Story