Tue Nov 28 2023 16:44:14 GMT+0000 (Coordinated Universal Time)
RK Roja : రోజా పరువు నష్టం దావా
మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై పరువునష్టం దావా వేశారు. నగరి కోర్టులోక్రిమినల్ డిఫమిషన్ వేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులోక్రిమినల్ డిఫమిషన్ పిటీషన్ వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఈ పిటీషన్ వేశారు. తన పరువుకు నష్టం కలిగించే విధంగా బండారు సత్యనారాయణ మూర్తి వ్యవహరించారని ఆర్కే రోజా తాను దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.
తనను కించ పర్చారంటూ...
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తితో పాటు మరి ఇద్దరిపై ఈ పరువు నష్టం దావా వేశారు. కొన్నాళ్ల క్రితం బండారు సత్యనారాయణమూర్తి మంత్రి ఆర్కే రోజాను మీడియా సమావేశంలో కించపర్చే విధంగా మాట్లాడారంటూ, అందుకు తగిన ఆధారాలను కూడా రోజా తరుపున న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.
Next Story