Thu Dec 18 2025 17:52:25 GMT+0000 (Coordinated Universal Time)
కంటతడి పెట్టిన రోజా
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తలచుకుని మంత్రి ఆర్కే రోజా కంటతడి పెట్టారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తలచుకుని మంత్రి ఆర్కే రోజా కంటతడి పెట్టారు. ఆయన ఎంతో నీచంగా మాట్లాడారన్నారు. మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? అని రోజా ప్రశ్నించారు. ఈ విషయాన్ని బండారు సత్యనారాయమూర్తి భార్య, కూతురిని అడుగుతున్నానని తెలిపారు.
బండారు చేసిన కామెంట్స్...
మీ పార్టీలో ఉన్నప్పుడు తాను మంచిదాన్నని, వేరే పార్టీలో ఉన్నప్పుడు మాత్రం చెడ్డదానిని ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు. వైసీపీ లో ఉండే మహిళలకు కుటుంబాలు లేవా అని నిలదీశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అన్నారు. ప్రశ్నిస్తే తన క్యారెక్టర్ పై దాడి చేస్తారా? అని అన్నారు. టీడీపీ తెలుగు దుశ్వాసన పార్టీగా మారిపోయిందన్నారు.
Next Story

