Sun Mar 15 2026 13:07:35 GMT+0530 (India Standard Time)
జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అన్న మంత్రి
వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ త్వరలోనే జైలుకు వెళతారని ఆయన అన్నారు. జగన్ ఐదేళ్లలో చేసిన పాపాలే ఆయనను వెంటాడుతున్నాయని తెలిపారు. కేవలం 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ ఆరోపించడం ఏంటని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
వాలంటీర్లతో వైసీపీ నేతలు...
వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగంచేయించుకున్నారన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. మాచర్ల వైసీపీ మాజీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని కాస్తయినా చూపించగలరా? అంటూ మంత్రి ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని ఆయన అన్నారు.
Next Story

