Thu Mar 19 2026 12:04:07 GMT+0530 (India Standard Time)
అమరావతి రైతుల కొత్త డిమాండ్లు ఇవే
అమరావతి రైల్వే లైన్ భూసేకరణ విషయంలో మంత్రి పొంగూరు నారాయణ రైతులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు

అమరావతి రైల్వే లైన్ భూసేకరణ విషయంలో మంత్రి పొంగూరు నారాయణ రైతులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించడానికి ఈ సమావేశాన్నిఏర్పాటు చేశారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా...
అయితే రైతులు మాత్రం తమకు భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు పొందాలని ఈ సందర్భంగా రైతులు మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. భూమిని కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని వారు మంత్రి నారాయణను కోరారు. అయితే ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, న్యాయం చేయడంలో కృతనిశ్చయంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు.
Next Story

