Thu Mar 19 2026 12:38:25 GMT+0530 (India Standard Time)
మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్
మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన కు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది

మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన కు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు కన్పించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్ని నాని కోరారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో పేర్ని నాని ఉన్నారు.
మంత్రుల కమిటీలో....
ఇటీవల పేర్ని నాని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యోగులను బుజ్జగించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో సయితం పేర్ని నాని సభ్యుడిగా ఉన్నారు. దీంతో మరో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత కొద్దిరోజులుగా వీరు ముగ్గురు సమావేశమవుతున్నారు.
- Tags
- corona
- perni nani
Next Story

