Mon Feb 02 2026 10:49:12 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి అప్పీల్ ను ఆహ్వానిస్తున్నాం
సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ విధానంపై చిరంజీవి చేసిన సూచనలను పరిశీలిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు

సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ విధానంపై చిరంజీవి చేసిన సూచనలను పరిశీలిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చిరంజీవితో పాటు మరికొందరు పెద్దలు జీవో నెంబరు 35 విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారన్నారు. అయితే దీనిపై పరిశీలించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని పేర్ని నాని తెలిపారు.
జగన్ తో మాట్లాడి....
చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు కొన్ని సూచనలు చేశారని, వీటిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆహ్వానిస్తున్నారని ఆయన తెలిపారు.
Next Story

