Mon Feb 02 2026 00:27:11 GMT+0000 (Coordinated Universal Time)
సంతృప్తికరమే.. సమ్మె విరమిస్తారని అనుకుంటున్నా
ఉద్యోగులు ప్రభుత్వ వైఖరితో సంతృప్తి చెందుతారని తాను భావిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు

ఉద్యోగులు ప్రభుత్వ వైఖరితో సంతృప్తి చెందుతారని తాను భావిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. వారు లేవనెత్తిన సమస్యలకు, డిమాండ్లకు తాము కొన్ని పరిష్కారం చూపామనే తాను అనుకుంటున్నానని అన్నారు. అయితే వారి డిమాండ్లను పరిష్కరించడానికి ఎంత వరకూ నిధులు అవసరమవుతాయన్నది అధికారులతో చర్చించాల్సి ఉందని పేర్ని నాని తెలిపారు.
సానుకూల వాతావరణంలో....
నిన్న జిరిగిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని పేర్ని నాని తెలిపారు. ఈరోజు సాయంత్రానికి సమ్మె ను విరమించుకుంటారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక భారానికి మించి ఉద్యోగులకు అండగా నిలవాలని భావిస్తుందని చెప్పారు. ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముందని చెప్పారు.
Next Story

