Thu Mar 19 2026 00:18:36 GMT+0530 (India Standard Time)
బాబుకు వయసు పెరిగినా?
వరదల సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు.

వరదల సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబుది పరామర్శ యాత్రగా కన్పించడం లేదన్నారు. రాజకీయ యాత్రగానే ఆయన చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. వరదల సమయంలోనూ చంద్రబాబు తన వయసును మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా తిరిగారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
వరదలు వచ్చినప్పుడు...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వస్తే ఈదుకుంటూ వెళ్లారా? అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు జనంలో కన్పించాలన్న తపన ఎక్కువని, ఆయన ప్రచారాన్ని కోరుకుంటారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు ఇకనైనా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాలని కోరారు.
Next Story

