Sat Dec 06 2025 10:26:34 GMT+0000 (Coordinated Universal Time)
పుంగనూరుకు రా.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి ఆహ్వానం
పుంగనూరుకు వచ్చి చంద్రబాబు పోటీ చేయాలని, తాను ఆహ్వానిస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

పుంగనూరుకు వచ్చి చంద్రబాబు పోటీ చేయాలని, తాను ఆహ్వానిస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారన్నారు. ఇక కుప్పంకు రావొద్దని అక్కడి ప్రజలు చంద్రబాబుకు చెప్పారన్నారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలు తమకు అండగా నిలిచారన్నారు. ఏ ఎన్నికైనా గెలిచి వాడే నాయకుడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
కుంటిసాకులు...
ఈ ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబు కుంటిసాకులు వెతుకుతున్నారని, దొంగ ఓట్లు ఎక్కడ పోలయ్యాలో చెప్పాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. టీడీపీని ఇక ప్రజలు దగ్గరకు రానివ్వరని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమయిందన్నారు. కుప్పం మున్సిపాలిటీ ప్రజలకు పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

