Tue Mar 03 2026 07:17:34 GMT+0530 (India Standard Time)
పునీత్ కుటుంబాన్ని కలిసిన పెద్దిరెడ్డి
కర్ణాటకలో సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు

కర్ణాటకలో సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ సతీమణిని అశినిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి సానుభూతిని వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తనను బాధించిందని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
గొప్ప మానవాతావాది...
పునీత్ రాజ్ కుమార్ కొంత కాలం క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ మంచి కార్యక్రమాలను చేసి అందరి మన్ననలను పొందారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన గొప్ప మానవతావాది అని అన్నారు.
Next Story

